27 June, 2026 | 5:07 AM

కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడికి పరామర్శ

25-06-2025 01:08 AM

మునుగోడు,జూన్ 24 (విజయ క్రాంతి): దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి  హైదరాబాదులో చికిత్స పొందుతున్న తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కప్పల రాజేష్ ను ఆసుపత్రికి వెళ్లి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పరామర్శించారు.

తుంగతుర్తి నియోజకవర్గం లో  అక్రమ మట్టి దందాను ప్రశ్నిస్తున్న  యూత్ కాంగ్రెస్ తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు  కప్పల రాజేష్ పై  అడ్డ గూడూరు మండల కేంద్రంలో  ఈనెల 21 శనివారం  రాత్రి దుండగులు దాడి చేశారు.

ఈ దాడిలో  గాయపడ్డ కప్పల రాజేష్  ను వనస్థలిపురం లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి కప్పల రాజేష్ ను పరామర్శించారు.రాజేష్ తో పాటు  నియోజకవర్గ నాయకులు దాడి జరిగిన తీరు ను ఆయన అడిగి తెలుసుకున్నారు.