19-08-2025 11:41:51 PM
క్యాబిన్ ఇరుక్కొని డ్రైవర్ మృతి
అదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ మండలంలోని కుష్టి వంతెన వద్ద మంగళవారం అదుపుతప్పి ఎత్తయిన వంతెన పైనుంచి కింద పడిపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కొని మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదం ఎలా జరిగింది మృతుడు ఎవరు అనే వివరాలపై విచారణ చేపడుతున్నారు.