calender_icon.png 20 August, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్​డీ డాక్టరేట్ అందుకున్న అసిస్టెంట్ ​ప్రొఫెసర్ స్వామి

20-08-2025 01:45:56 AM

జువాలజీలో పరిశోధనలకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రదానం

ఎల్బీనగర్:  ఖైరతాబాద్ ​డిగ్రీ కాలేజీ జంతుశాస్త్ర విభాగాధిపతి, అసిస్టెంట్ ​ప్రొఫెసర్ ​డాక్టర్​ జిలకర స్వామి ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ డాక్టరేట్ ​పట్టా అందుకున్నారు.  జంతుశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ ​జి. సునీతాదేవి పర్యవేక్షణలో  ‘ఎఫెక్ట్ ఆఫ్ సోమాటోట్రోపిన్ ఆన్ గ్రోత్ ఫుడ్ కన్వర్షన్ ఎఫిషి యన్సీ అండ్ బయోకెమికల్ ఆల్టరేషన్స్ ఆఫ్ ఫిష్ కట్ల కట్ల’  అను అంశంపై ఆయన పరిశోధనలు చేసి సమర్పించిన థీసిస్ కి గాను ఓయూ – 2024 లో డాక్టరేట్ ను ప్రకటించింది.

మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవం సందర్భంగా  ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన కాన్వకేషన్​ డే కార్యక్రమంలో ఓయూ చాన్స్​లర్​, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్, ఓయూ వైస్ చాన్స్​లర్​ కుమార్ మొగుళం చేతుల మీదుగా  ​స్వామి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్​ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ​బి. రాజేంద్ర కుమార్, సహచర ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ​స్వామికి అభినందనలు తెలిపారు. 

ప్రిన్సిపాల్​ డాక్టర్​ రాజేంద్ర కుమార్ ​మాట్లాడుతూ... స్వామి డాక్టరేట్ అందుకోవడం సంతోషదాయక విషయమని, తమ కళాశాల అధ్యాపకుడు పరిశోధనలో రాణించడం, ఆ ఫలితాలు విద్యార్థుల పరిశోధనలు, జిజ్ఞాస ప్రాజెక్టులలో ఎంతగానో ఉపయోగమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మండలం దత్తప్ప గూడెం గ్రామానికి చెందిన స్వామి ఎమ్మెస్సీ, బీఈడీ ఓయూలోనే పూర్తి చేశారు. అనంతరం అధ్యాపక వృత్తిని ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు.  డాక్టర్​ స్వామి  జవాలజీలో రాసిన రీసెర్చ్​పేపర్లు పలు, జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్​లో ప్రచురితమవ్వడం విశేషం.