22-10-2025 01:05:37 AM
హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘కే -ర్యాంప్’. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.17.5 కోట్ల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ర్యాంపేజ్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, ఎస్‌కేఎన్, డైరెక్టర్లు శ్రీను వైట్ల, సాయిరాజేశ్, వశిష్ఠ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథి దిల్ రాజు మాట్లాడుతూ.. “రైట్ కంటెంట్‌ను తీసుకుని ఇన్వాల్వ్ అయి సినిమా నిర్మిస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్నిస్తారు. కష్టడేవారికి ఏదో ఒకరోజు సక్సెస్ దక్కుతుంది. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అలాగే కష్టపడండి” అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో ఇంతకంటే పెద్ద సక్సెస్‌లు రావొచ్చు కానీ మా నమ్మకాన్ని నిలబెట్టిన విజయమిది. కిరణ్ అబ్బవరం సినిమా అంటే నమ్మకంగా థియేటర్స్‌కు వెళ్లొచ్చు అనేలా సినిమాలు చేస్తానని మాటిస్తున్నా” అన్నారు. హీరోయిన్ యుక్తి మాట్లాడుతూ.. “కే -ర్యాంప్’లో నేను చేసిన మెర్సీ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. కిరణ్ మంచి కోస్టార్. ఆయనతో మళ్లీమళ్లీ సినిమాలు చేయాలని ఉంది” అని చెప్పింది.
‘నేను 90’ఎస్ కిడ్‌ను. థియేటర్ బయట మౌత్‌టాక్ చూసి సినిమాకు వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ వచ్చి భయపెడుతున్నాయి. రివ్యూస్ వారి వ్యక్తిగతమని నేను గౌరవిస్తా. సినిమా బాగుంటే ఏవీ పట్టించుకోమని నిరూపిస్తూ ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తున్నార’ని డైరెక్టర్ జైన్స్ నాని తెలిపారు.
నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ.. “నా ఫేవరేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. నాకు ఇష్టమైన దర్శకులు శ్రీను వైట్ల, సాయిరాజేశ్, వశిష్ట మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. నైజాంలో మా మూవీని డిస్ట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేసిన దిల్ రాజు, శిరీష్‌కి థ్యాంక్స్. మా సంస్థలో అందరూ కలిసి చూసే సినిమాలే నిర్మిస్తాం” అన్నారు.