20-10-2025 01:57:39 AM
చాలా కాలం తర్వాత ఇటీవల ‘శుభం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్టార్ బ్యూటీ సమంత. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రతో అలరించింది. అంతకుముందు ‘హాలీవుడ్ సినిమాకు రీమేక్‌గా రూపొందించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో నటించింది. దర్శక ద్వయం రాజ్-డీకే తెరకెక్కించిన ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా సమంత తనతో కలిసి సినిమాల కోసం పనిచేసిన దర్శకుల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను బోల్డ్ సీన్స్‌లో నటించకపోవడానికి కారణం కూడా సమంత చెప్పింది. ‘సినిమాల్లో నేను చేసిన పాత్రలన్నీ మంచివే. నేను సెక్సీగా ఉంటానని నాకే ఎప్పుడూ అనిపించలేదు.
అందుకు కారణం నాతో కలిసి పనిచేసిన దర్శకులే. ఎందుకంటే నేను పనిచేసిన డైరెక్టర్స్ నాకు బోల్డ్ క్యారెక్టర్స్ ఇవ్వలేదు. ఏ పాత్ర చేసినా వందశాతం ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కష్టపడతాను. నాకు తెలిసిందల్లా పని పట్ట అంకితభావంతో మసలుకోవడమే. అదొక్కటే నా పాలసీ’ అంటూ చెప్పుకొచ్చింది. సమంత చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడామె తెలుగులో ‘మా ఇంటి బంగారం’ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును సమంత స్వయంగా నిర్మిస్తోంది. దీనికి నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. అటు బాలీవుడ్ లోనూ ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సినిమా చేస్తోంది సమంత. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.