calender_icon.png 23 October, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

23-10-2025 01:52:47 PM

పాట్నా: బీహార్‌లో మహాఘట్‌బంధన్(Mahagathbandhan) కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, రాష్ట్రీయ జనతాదళ్ (Rashtriya Janata Dal ) నాయకుడు తేజస్వి యాదవ్‌(Tejashwi Yadav) పేరును కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) గురువారం ప్రకటించారు. ఆయనతో పాటు, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానీని కూటమికి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (All India Congress Committee) సీనియర్ పరిశీలకుడు అశోక్ గెహ్లాట్ పాట్నాలో యాదవ్, సహాని, కూటమిలోని ఇతర నాయకుల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. బీహార్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కృష్ణ అల్లవారు, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Bihar Pradesh Congress Committee) అధ్యక్షుడు రాజేష్ రామ్, వామపక్షాల నాయకులు కూడా హాజరయ్యారు. ఇంకొక ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని తరువాత ప్రకటిస్తామని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. కలిసి కట్టుగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధిస్తామని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి(NDA Bihar CM candidate) ఎవరో ప్రకటించాలని అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేశారు.