calender_icon.png 23 October, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డిదే

23-10-2025 02:07:48 PM

కాంగ్రెస్ సర్కార్ ముస్లింలను అన్యాయం చేస్తోంది

హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆరోపించారు. మైనార్టీ మంత్రి లేని ఏకైక కాంగ్రెస్ కేబినెట్ రేవంత్ రెడ్డిదే అన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వకుండా అజారుద్దీన్ ను బలి చేశారని పునరుద్ఘటించారు. సీఎం, మంత్రి మధ్య గొడవలో ఐఏఎస్ అధికారి రిజ్వీని బలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఐఏఎస్ కే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. శ్మశాన వాటిక విషయంలో జూబ్లీహిల్స్ మైనార్టీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ముస్లిం నేత సల్మాన్ ఖాన్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.