calender_icon.png 23 October, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజు నవ్వుల పటాకులు!

22-10-2025 01:06:52 AM

నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, నవీన్ పోలిశెట్టితో కలిసి సరికొత్త వినోదాన్ని పంచనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది.

ఇది కాస్తా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నవ్వుల పటాకులను పేలుస్తోంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు మరిన్ని నవ్వులతో నిండిన పండుగకు హామీ ఇచ్చేలా రూపుదిద్దుకున్న ఈ దీపావళి ప్రోమో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచేలా ఈ చిత్రం నుంచి త్వరలో తొలిగీతం కూడా విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; ఛాయాగ్రహణం: జే యువరాజ్.