calender_icon.png 12 November, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి

12-11-2025 10:24:33 PM

రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

హుజూర్ నగర్/మేళ్లచెరువు: హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు, గరిడేపల్లి, మేళ్లచెరువు, మఠంపల్లి, చింతలపాలెం మండలాలలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... మేళ్లచెర్వు శివరాత్రి జాతర నాటికి ఎన్ఎస్పీ కాల్వపై నిర్మిస్తున్న బ్రిడ్జిలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. మేళ్ళచెరువులో రూ.3 కోట్లతో కోదాడ - రేవూరు రోడ్డు, మేళ్ళచెరువు మెయిన్ రోడ్డు, డబుల్ లైన్ నుండి ఫోర్ లైన్ రోడ్డును ప్రారంభించారు.

ఇటీవల కందిబండ వద్ద వరదలకు తెగిపోయిన బ్రిడ్జిలు వేగవంతంగా, నాణ్యతతో నిర్మించి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మేళ్లచెర్వు గ్రామంలో షాదిఖానా నిర్మించుటకు ఒక కోటి రూపాయలు నిధులు మంజూరు చేశామని స్థలం సేకరించాలని తహసీల్దార్ ను ఆదేశించారు. ముత్యాల బ్రాంచ్ కెనాల్ చివరి ఆయకట్టుకు సాగర్లో నీరు తక్కువగా ఉన్నప్పుడు సాగునీరు అందడం లేదని పాత వెల్లటూరులో మహాత్మా గాంధీ ముత్యాల బ్రాంచ్ కెనాల్ పేరిట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను నిర్మించి పాత వెల్లటూరు నుండి ముత్యాల బ్రాంచ్ కెనాల్ లో నీరు ఎత్తిపోసి 365 రోజులు పాటు సాగునీరు అందేలా చూస్తున్నానని లిఫ్ట్ ద్వారా మేళ్లచెరువు మండలంలో 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, తహసిల్దార్ రాజేందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.