calender_icon.png 5 May, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐతో బోధన విద్యార్థులకు వరం

24-04-2025 12:53:25 AM

డీఈఓ వెంకటేశ్వర చారి 

బూర్గంపాడు,ఏప్రిల్23(విజయక్రాంతి): ఆర్టిఫీఫియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)తో బోధన వి ద్యార్థులకు వరంగా మారిందని జి ల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి అన్నారు. బుధవారం బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ ,టీచర్స్ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న ఏఐ ప్రోగ్రాం గురించి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు.అంజనాపురం పాఠశాల అభివృద్ధి పథంలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులతో చెప్పారు.

పాఠశాలలో ఎటు చూసినా ప్రకృతి పులకరిస్తోందని,మొక్కల సంరక్షణకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులను అభినందించారు.అనంతరం విద్యార్థులకు ప్రోగ్రెస్ కారడ్స్,నోట్ బుక్స్ అందించి ఈ వేసవి సెలవులలో వాటిని రాసే విధంగా సూచనలు చేశారు.అలాగే ఐదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే సందర్భంగా కేక్ కట్ చేసి వారి సమక్షంలో విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచారు.ఈ సందర్భంగా పిటీఎం సభ్యులు,ఎఎపిసి చైర్మన్,ఉపాధ్యాయులు డీఈఓ ను సన్మానించారు.ఈ కార్యక్రమం లో ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం తేజావత్ కిషన్ రావు,ఉపాధ్యాయులు టి.బాబు రావు,ఎస్ శంకర్,ఎస్ సునీత,బి.పద్మ తదితరులు పాల్గొన్నారు