14-12-2025 09:00:19 AM
మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి
మీ గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా
నూతన సర్పంచ్ లకు సూచించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం,(విజయక్రాంతి): మీ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని, మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని ముత్తారం మండలంలోని నూతన సర్పంచ్ లకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ముత్తారం మండలంలోని అడివి శ్రీరాంపూర్, కేశనపల్లి, దర్యాపుర్, హరిపురం, మైదంబండ, మచ్చుపేట, పారుపల్లి, జిల్లాలపల్లి, రామకృష్ణాపూర్, సీతంపేట సర్పంచ్ లు శనివారం రాత్రి హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన సర్పంచ్ లకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ ప్రజలు మీపై నమ్మకం తో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేల నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, మాజీ ఎంపిటిసి దొడ్డ గీతారాణి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, సీతంపేట మాజీ సర్పంచ్ పులిపాక నాగేష్ తదితరులు పాల్గొన్నారు.