12 April, 2026 | 2:34 AM

పల్లె పోరు.. 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్

14-12-2025 11:55 AM

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్(Gram Panchayat Elections) ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అన్ని జిల్లాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

సర్పంచ్ పదవులకు మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 38,337 పోలింగ్ కేంద్రాలలో 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఫలితాలు ప్రకటించబడతాయి. 

ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.. ఎక్కడ ఎంతంటే?

యాదాద్రి భువనగిరి జిల్లాలో 56.51 శాతం

సంగారెడ్డి జిల్లాలో 59.87 శాతం

నారాయణపేట జిల్లాలో 45.84 శాతం 

జోగులాంబ గద్వాల జిల్లాలో 56.10 శాతం

సూర్యాపేట జిల్లాలో 60.07 శాతం

మెదక్ జిల్లాలో 59.26 శాతం

ఖమ్మం జిల్లాలో 64.32 శాతం

నిజామాబాద్ జిల్లాలో 49.13 శాతం