9 July, 2026 | 2:15 AM

పాఠశాలల అభివృద్ధికి సహకారం అభినందనీయం

11-06-2024 12:11 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

ముత్తంగిలో రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్‌చెరు, జూన్ 10: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పరిశ్రమలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని డీఎన్ కాలనీలో గ్లాండ్ ఫార్మా పరిశ్ర మ సహకారంతో రూ.2 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ నూతన భవన నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అభివృద్ధి పనుల్లో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీవేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్నశ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సీఎస్‌ఆర్ హెడ్ రఘురామన్ తదిత రులు పాల్గొన్నారు.