calender_icon.png 6 August, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిరేకల్ హైవే వెంట వ్యభిచారం

05-08-2025 04:50:01 PM

పట్టపగలే నడుస్తున్న వైనం

వాహనాలను ఆపుతున్న ఆంటీలు

బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం

హైవే పై పోలీస్ పెట్రోలింగ్ జాడేది

నకిరేకల్,(విజయక్రాంతి): ఒకప్పుడు వ్యభిచారం నగర ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా  రాత్రి వేళలో జరిగేది. నేడు పట్టణాలకు విస్తరించింది. కొంతమంది ఆంటీలు, మహిళలు వ్యభిచార వృత్తిని ఎంచుకుంటున్నారు. పట్టపగలే నకిరేకల్ నుండి కట్టంగూరు వరకు నేషనల్ హైవే  వెంట కొన్ని అడ్డాలను ఏర్పాటు చేసుకొని  బహిరంగ ప్రదేశాలలో వ్యభిచారం జోరుగా సాగుతుందని ప్రచారం వినబడుతుంది.

పట్టపగలే ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హైవే వెంట కొంతమంది ఆంటీలు కూర్చుని హైవే వెంట వచ్చిపోయే వాహనాలను ఆపుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అక్కడ అక్కడ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరు నుండి ఒకసారికి రూ.500 నుండి రూ.1000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా లేక  డబ్బులు అవసరాల కోసం నేరుగా వాళ్ళే చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో నకిరేకల్ పట్టణంలో ఒక హోటల్లో వ్యభిచారం ముఠాను అదుపులోకి తీసుకున్న విషయాన్ని చూశాం.

కానీ అయినా కూడా ఎక్కడ కూడా ఆగలేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇంత తతంగం జరుగుతున్న స్థానిక పోలీసులకు విషయం తెలియలేదా లేక తెలిసిన తమకేమీ పట్టనట్టు వ్యవరిస్తున్నారా అని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా పోలీసులు గమనించి హైవే వెంట పెట్రోలింగ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వ్యభిచారాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.