వర్షాకాలంలో వంటకు తంటా!
ప్రభుత్వ పాఠశాలల్లో వర్షాకాలంలో ప్రధాన సమస్యలు ఏమిటి?
- చెట్ల కింద మధ్యాహ్న భోజనం వండటం
- డైనింగ్ హాళ్లు లేకపోవడం
- నీటి సౌకర్యం లేకపోవడం
- వంట సామగ్రి నిల్వకు స్థలం లేకపోవడం
- వర్షాల సమయంలో విద్యార్థులు, వంట సిబ్బంది ఇబ్బందులు పడటం
కేసముద్రం, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కిచెన్ షెడ్లు నిర్మించలేదు. దీంతో మండల వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో చెట్ల కింద వంట చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 57 ప్రభుత్వ విద్యాలయాలు ఉండగా అం దులో 4,000 వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి అవసరమైన మౌలిక వసతులు అనేక పాఠశాలలో ఇప్పటివరకు కల్పించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, వంట వండి పెట్టే ఏజెన్సీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక పాఠశాలల్లో నీటి వసతి లేదని, చాలా చోట్ల కిచెన్ షెడ్లు లేవని , దీనితో పాఠశాలల ఆవరణలో వరండాలు, చెట్ల కింద వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
తెలంగాణలోని తాజా జిల్లా వార్తల కోసం విజయక్రాంతి జిల్లా వార్తలు సెక్షన్‌ను సందర్శించండి.
ఒక క్షణం ఆలోచించండి...
స్మార్ట్ క్లాస్‌రూమ్స్ గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో, ఇంకా వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారుల మధ్యాహ్న భోజనం చెట్ల కిందే వండుతున్నారు. వర్షం వస్తే వంట ఆగిపోతుంది.. పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
చాలాచోట్ల నీటి వసతి లేని చోట వ్యవసాయ బావుల నుండి, సమీపంలోని ఇండ్ల నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వంటకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ వర్షాకాలంలో తాము వంట చేయడానికి తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి అవసరమైన వంట చెరుకు నిల్వ చేయడం, సామాగ్రి నిలువ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే జులై, ఆగస్టు నెలలో వంట చేయడం తమకు పెద్ద తంటగా మారిందని వాపోతున్నారు.
విద్య, ప్రభుత్వ పాఠశాలలు, పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం విజయక్రాంతి ఎడ్యుకేషన్ న్యూస్ చదవండి.
డైనింగ్ హాళ్లు లేవు..
ఇక అధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న హైస్కూళ్ళు, కొన్ని ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేయడానికి అనువైన వసతి లేక తరగతి గదుల్లో, పాఠశాల ఆవరణ చెట్ల కింద భోజనం చేస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో డైనింగ్ హాళ్లను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా చాలా చోట్ల పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు.
ఇక ఇదే తరహాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కిచెన్ షెడ్ నిర్మాణం ప్రారంభించినప్పటికీ చాలా చోట్ల నిర్మించలేదు. దీనితో ఈ విద్యా సంవత్సరంలో కూడా పాత పద్ధతిలో చెట్ల కింద వంట చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలలో కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్ నిర్మించి, నీటి వసతి కల్పించాలని కోరుతున్నారు.
కేసముద్రం మండలంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు లేక మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఇబ్బందిగా మారింది. వర్షాకాలంలో వంట సిబ్బంది చెట్ల కింద వంట చేయాల్సి వస్తుండగా, విద్యార్థులు తరగతి గదుల్లో లేదా ఆవరణలో భోజనం చేస్తున్నారు. నీటి వసతి లేకపోవడం సమస్యను మరింత పెంచుతోంది.
తాజా బ్రేకింగ్ అప్డేట్స్ కోసం విజయక్రాంతి లేటెస్ట్ న్యూస్ ఫాలో అవ్వండి.
ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్లు ఎందుకు అవసరం?
వర్షాలు, ఎండలు వంటి వాతావరణ పరిస్థితుల్లో పరిశుభ్రంగా, సురక్షితంగా మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి కిచెన్ షెడ్లు అవసరం.
డైనింగ్ హాళ్లు లేకపోతే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
విద్యార్థులు తరగతి గదుల్లో లేదా చెట్ల కింద భోజనం చేయాల్సి వస్తుంది. ఇది పరిశుభ్రత, భద్రత పరంగా సమస్యలను సృష్టిస్తుంది.
మధ్యాహ్న భోజన పథకంలో ప్రధాన మౌలిక సదుపాయాలు ఏమిటి?






