27 May, 2026 | 5:25 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

జొన్న పంట తరలించేందుకు సహకార సంఘం అధికారులు చర్యలు చేపట్టాలి

27-05-2026 03:25 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మార్కెట్ పరిధిలో కొనుగోలు చేస్తున్న జొన్న పంటను త్వరితగతిన తరలించేందుకు సహకార సంఘం అధికారులు తమ చర్యలు చేపట్టాలని సోమల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల పోతన్న అధికారులను కోరారు. జొన్న పంట కొనుగోలు చేసిన తర్వాత పంటను తొలగించే బాధ్యత అధికారుల దేనని కానీ రైతులను అధికారులు జొన్న పంట లారీల్లో ఎక్కించేంతవరకు బాధ్యులుగా చేయడం సరికాదన్నారు.

పంటను తూకం వేసిన రైతులు మాత్రం రాత్రి పగలు కాపలాగా ఉండాల్సి వస్తుందని వాపోయారు. ఒకవైపు ఖరీఫ్ కాలం దగ్గర పడడంతో రైతులు పొలాలకు వెళ్లలేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. సాధ్యమైనంతవరకు లారీలను రప్పించి బస్తాలను పంపించేలా చూడాలని కోరారు. రైతులు లారీల కొరత ఉందనే విషయాన్ని గమనించి సహకరించాలన్నారు