27 May, 2026 | 5:12 PM

Breaking News

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •   మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు   •  

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

27-05-2026 03:26 PM

పెద్దపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య

పెద్దపల్లి, మే 27(విజయ క్రాంతి): జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవిన్యూ డివిజనల్ అధికారి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ  దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ  రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని,  జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని  తెలిపారు. 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు.  రాష్ట్ర అవతరణ వేడుకల వేదిక , కూర్చోవడానికి ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, ఆర్ &బీ అధికారులను ఆదేశించారు.  ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని,  వేడుకల వద్ద ఏ.ఎన్.ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే  వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని,  అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు  మున్సిపల్ కమిషనర్  ఏర్పాటు చేయాలని ఆర్డిఓ తెలిపారు.  వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ  అందించాలన్నారు.పెద్దపల్లి పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా  అధికారులు చర్యలు తీసుకోవాలని  అన్నారు.  ముఖ్య అతిథి అందించే సందేశం  రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా మే 29 సాయంత్రం నాటికి అందజేయాలని అన్నారు.

ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏ సి పి.జి. కృష్ణ ,కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ , సి విభాగం సూపరింటెండెంట్ కుమారస్వామి, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్  తాసిల్దార్ రాజయ్య, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.