02-11-2025 12:26:11 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ సిటీ (హెచ్-సిటీ) ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం, అంతర్గత సమన్వయ లోపంతో అటకెక్కింది. సీఎం రేవం త్‌రెడ్డి గత ఏడాది డిసెంబర్ 5న శంకుస్థాపన చేసినా, నేటికీ ఒక్క పని కూడా ప్రారం భం కాకపోవడం జీహెచ్‌ఎంసీలోని ఇంజనీరింగ్ విభాగం మొద్దు నిద్రకు నిలువుటద్దం పడుతోంది. విభాగాధిపతుల మధ్య సమన్వయం లేకపోవడమే వేల కోట్ల ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.
ముందుకు సాగని భూసేకరణ
హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఐదు ప్యాకేజీల కింద 23 పనులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ.7,038 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిం ది. అయితే, పనులు ప్రారంభించడానికి కీలకమైన భూసేకరణ ప్రక్రియే ముందుకు సాగడం లేదు. స్థల సేకరణ చేయాల్సిన రెవెన్యూ విభాగం, ఆస్తులను గుర్తించాల్సిన టౌన్‌ప్లానింగ్ విభాగం, పనులు చేపట్టాల్సిన ఇంజనీరింగ్ విభాగం మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది.
హెచ్-సిటీ పనుల్లో భాగంగా నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణం కోసం రూ.1,090 కోట్లతో ఆరు స్టీల్ ఫ్లుఓవర్లు, ఆరు అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికోసం పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఆస్తులతో సహా అనేక ఆస్తులకు జీచ్‌హెఎంసీ మార్కింగ్ చేసింది. అయితే, పలువురు యజమానులు కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియ నిలిచిపోయింది.
కనీసం కోర్టు పరిధిలోలోని ఆస్తులనైనా సేకరించి పనులు ప్రారంభించాలని కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఆదేశించినా, క్షేత్రస్థాయిలో పురోగతి శూన్యం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇదే విషయంపై జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ పరిధిలోని పనులు మొదలైనా, జీహెచ్‌ఎంసీ పనులు ఎందుకు మొదలు కాలేదని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.
మూడేళ్లుగా పెండింగ్‌లోనే..
గత బీఆర్‌ఎస్ హయాంలోనే ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక, ఆ పనులన్నింటినీ హెచ్-సిటీ-1 పేరుతో ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ప్రతిపాదనలు సిద్ధమై మూడేళ్లు, కొత్త ప్రభు త్వం కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నా ఒక్క పని కూడా మొదలు కాలేదు.
జోనల్ కమిషనర్లకూ దక్కని సహకారం
పనుల్లో జాప్యాన్ని గమనించిన కమిషనర్ కర్ణన్.. పర్యవేక్షణ బాధ్యతలను జోనల్ కమిషనర్లకు అప్పగించారు. వారి ప్రయత్నాలకు ప్రాజెక్టు వింగ్ ఇంజనీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు సహకరించడం లేదని కొందరు జోనల్ కమిషనర్లే వాపోతున్నారు.
జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ వారికి ప్రా జెక్టు వివరాలు అందించడం లేదని, పర్యటనలో పాలుపంచుకోవడం లేదని తెలుస్తోం ది. ప్రాజెక్టు వివరాలు తెలియక జోనల్ కమిషనర్ల పర్యటనలు సైతం వృథా అవుతున్నా యి. అంతర్గత ఆధిపత్య పోరు, సమన్వయ లోపం వీడితే తప్ప హె-సిటీ పనులు ముందుకు సాగేలా కనిపించడం లేదు.