16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

చెత్తబుట్టలో వీసీ నివేదిక ప్రతులు!

02-03-2026 12:00 AM

మానుకోటలో టీచర్ల వినూత్న నిరసన

మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల పతనానికి ఉపాధ్యాయుల హక్కుల హననానికి అనుకూలంగా ఉందంటూ ఆదివారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా కమిషన్ నివేదిక ప్రతులను చించి చెత్తబుట్టలో వేసి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేష్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కొరకు చేపట్టవలసిన కార్యక్రమాలను అధ్యయనం చేసి తగు సూచనలు  చేయడానికై ఏర్పాటైన విద్యా కమిషన్ అందజేసిన నివేదిక విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా ఉందని విమర్శించారు.

విద్యా కమిషన్ రిపోర్టు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉందని దుయ్యపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 వేల ప్రభుత్వ పాఠశాలను బాగు చేయడానికి సూచనలు చేయాల్సింది పోయి వాటి స్థానంలో 2,000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేయడం విడ్డూరంగా ఉందని, ఈ సిఫార్సులు అమలు చేస్తే రాష్ట్రంలో అనేకమంది బడుగు, బలహీన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు.

టి పి టి ఎఫ్ రాష్ట్ర  పూర్వ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకునూరి మురళి నేతృత్వంలో అందజేసిన విద్యా కమిషన్ నివేదిక పూర్తిగా అశాస్త్రీయంగా, బడిని ఊరికి దూరం చేసి, ప్రభుత్వ బడులను పాతర వేసే విధంగా ఉందన్నారు. ఇంత కాలం పాటు అధ్యయనం చేసి ఇచ్చిన విద్యా కమిషన్ నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని వాపోయారు.   పీ ఆర్ సీ, డిఏల ఎగవేతకు ప్రభుత్వమే వారి చేత చెప్పించినట్టుగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీశైలం, జిల్లా బాధ్యులు చీకటి ఉపేందర్, మల్లెల సాంబయ్య, రాచకొండ ఉపేందర్,  ఘనపురం బిక్షపతి, సరెడ్డి రామలింగారెడ్డి, గుండ్ల విజయకుమార్, అక్కినపల్లి బాబురావు, తీగల రమేష్ నర్సింహరాజు, భావ్ సింగ్, రఘువేందర్, అంజయ్య, గుడిబోయిన వెంకటేశ్వర్లు, దైద వెంకటేశ్వర్లు, నరేష్, గునిగంటి శ్రీను, మనోహర్, రఫిక్, అరుణ, కిరణ్మయి చిందం శ్రీనివాస్, నేలపోగుల దుర్గయ్య, రజియుద్దీన్, కోడం శ్రీనివాస్, కిస్టు, రంజిత్ కుమార్, సోమ రవి, పొద్దుటూరి రమేష్, రవీందర్, నాయిన సుధాకర్, ఎండి ఉస్మాన్, కృష్ణ, సత్య నారాయణ, ప్రభాకర్, ప్రతాప్, మణిశర్మ, వెంకటేశ్వర్లు, సిహెచ్ నాగరాజు యాకయ్య పాల్గొన్నారు.