calender_icon.png 1 September, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుల్లో విద్యార్థులకు రాగి జావ

31-08-2025 12:49:40 AM

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగి జావ మళ్లీ అందించనున్నారు. వరుసగా రెండే ళ్లు విద్యార్థులకు రాగి జావ అందజేసిన ప్రభు త్వం.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మాత్రం ఇంతవరకూ ప్రారంభించలేదు. అయితే దీనిపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులకు మళ్లీ రాగి జావను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఎంఈవోలు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. జావను వండి వడ్డించేందుకు గానూ మధ్యాహ్నం భోజనం కార్మికులకు ఫ్యూయల్ ఛార్జెస్ కింద ఒక విద్యార్థికి ఒక్కో రోజుకు 25 పైసలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.