31-08-2025 12:49:34 AM
-ఇతర కార్యక్రమాలకు తరలిస్తున్న తెలంగాణ సర్కారు
-ప్రధాని మోదీకి ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఈఎస్‌ఐ పథకం కింద కేంద్రం తెలంగాణకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభు త్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లిస్తోందని ప్రధాని మోదీకి ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ (టీసీహెచ్‌ఎస్‌ఏ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శనివారం అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్ర ప్రధానికి లేఖ రాశారు.
కేంద్ర ప్రభు త్వం ఈఎస్‌ఐ కోసం రూ. 241.80 కోట్ల నిధులను కేంద్రం అందించినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు. మెడిసిన్, సర్జికల్ సరఫరా చేసిన తమకు రూ.65 కోట్ల బిల్లులు చెల్లించాల్సిన ప్రభు త్వం కనీసం స్పందించడం లేదని ఆయన ప్రధానికి ఫిర్యాదు చేశారు. 2024, 2025 బిల్లులు చెల్లించకపోవడంతో ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌కు సప్లు ఆపేశామని తెలిపారు. ఈఎస్‌ఐ కోసం తమ వేతనాల నుంచి డబ్బులు చెల్లించిన ఉద్యోగులు ఇప్పుడు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే వెంటనే తమకు బిల్లులు చెల్లించేలా చూడాలని మోదీని ఆయన కోరారు.