31-08-2025 12:51:33 AM
హుస్నాబాద్, ఆగస్టు 30 : ఎస్టీ జాబితా నుంచి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు తెల్లం వెంకట్రావు, సోయం బాపురావులపై బంజారాలు భగ్గుమన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు, బాపురావు ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం గిరిజన నాయకులు మాట్లాడుతూ బంజారాల సు దీర్ఘ పోరాటాల ఫలితంగానే 1976లో తమ ను ఎస్టీ జాబితాలో చేర్చారని వివరించారు. కోయ జాతికి చెందిన సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావులకు బంజారాలు కూడా గుట్టలు, అడవుల్లో జీవనం సాగిస్తారనే విష యం తెలియదా అని ప్రశ్నించారు. ఆ ఇద్ద రు నేతలపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
బంజారా లంబాడీల హక్కులను కాపాడడానికి పార్టీలకతీతంగా గిరిజనులందరూ ఏక మవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మాలోతు బీలు నాయక్, భూక్య శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్, లావుడియా కిషన్ నాయక్, కైల్ నాయక్, రాములు నాయక్, గూగులోత్ తిరుపతి నాయక్, సరోజన, భీక్యా నాయక్, ధరావత్ మోహన్ నాయక్, అనిల్ నాయక్, రేనా నాయక్, జవహర్ నాయక్, కృష్ణా నాయక్‌పాల్గొన్నారు.