calender_icon.png 31 January, 2026 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాగి తీగల దొంగలు అరెస్ట్

31-01-2026 09:23:21 PM

90 కేజిల రాగి స్వాధీనం

అశ్వారావుపేట,(విజయక్రాంతి): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ లోని రాగి తీగలను(కాపర్) దొంగలిస్తూ, విక్రయానికి తరలిస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన దమ్మ పేట మండలం లో చోటు చేసుకుంది. దీనిపై శనివారం దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. మండల పరిధి లోని అచ్యుతాపురం స్టేజ్ వద్ద దమ్మ పేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా మారుతి కార్ లో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటం తో అదుపులోకి తీసుకొని విచారించగా రాగి తీగను అమ్మేందుకు రాజమండ్రి వెళుతున్నట్టు చెప్పారని డిఎస్పి తెలిపారు.

కాకినాడ జిల్లా కు చెందిన పల్లా లోవరాజు, రేఖ సుధీర్, కొవ్వూరు మండలానికి చెందిన సారిక సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి,  అదనపు ఆదాయం కోసం విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ లోని రాగి తీగలు దొంగలించటం చేస్తున్నారని  దమ్మ పేట, గురువాయి గూడెం,తొట్టిపంపు, మందల పల్లి గ్రామాల్లో నీ 8 ట్రాన్స్ ఫార్మర్స్ ల నుండి రాగి తీగలు తస్కరించినట్టు తెలిపారు.

దీనిపై రాగి దొంగతనాలపై దమ్మ పేట టిజిఎన్పిడిసిఎల్ఏఇఇ సాయి కిరణ్ పిర్యాదుపై నిఘా పెట్టినట్టు తెలిపారు.  వీరిపై దమ్మ పేటలో నాలుగు కేసులు, ఆంధ్రా లో 18 కేసులు ఉన్నట్టు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి 90 కిలోల రాగి తీగ, కారు, కట్టర్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్టు డి ఎస్ పి తెలిపారు. చాక చక్యంగా నిందితులను పట్టుకున్న దమ్మ పేట ఎస్ ఐ సాయి కిషోర్ రెడ్డి, వారు సిబ్బందిని జిల్లా ఎస్ పి రోహిత్ రాజ్, పాల్వంచ డి ఎస్ పి సతీష్ కుమార్ అభినందించారు.