calender_icon.png 31 January, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపల్లి డివిజన్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన మోహన్ కుమార్

31-01-2026 09:42:55 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన మేడిపల్లి డివిజన్ కు ఏసీపీగా బి. మోహన్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ గా పనిచేసిన ఆయనను మేడిపల్లి ఏసీపీగా నియమించారు. ఈ డివిజన్ పరిధిలోకి మేడిపల్లి, ఘట్కేసర్, పోచారం, చర్లపల్లి పోలీస్ స్టేషన్ లు రానున్నాయి. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ పోలీస్ శాఖ పనితీరును మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.