31-01-2026 09:27:09 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని కిచ్చన్నపేట మరియు అక్కంపల్లి రెండు గ్రామాలను కలుపుతూ ఏడు సంవత్సరాల క్రితం నూతన అక్కంపల్లి గ్రామపంచాయతీ ఏర్పాటు చేశారు.కానీ అక్కంపల్లి గ్రామస్తులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కిచన్నపేటకు ప్రాధాన్యత ఇవ్వకుండా అక్కంపల్లి వారికే మాజిపి, మా గ్రామము అంటూ అక్కంపల్లి గ్రామంలో నాలుగు వార్డులు కిచ్చన్నపేట గ్రామంలో నాలుగు వార్డులు సమానంగా ఉన్నాయని, అధిక ఓటరు అధిక జనాభా అక్కంపల్లి వారి కంటే కిచన్నపేట వారే ఎక్కువగా ఉన్నారు. కిచ్చన్నపేటకు న్యాయం జరగలేదని తెలుపుతూ కామారెడ్డి డిపిఓ, పిఆర్డిఈఈకు వినతి పత్రాన్ని కిచన్నపేట గ్రామస్తులు అందజేశారు.
గ్రామపంచాయతీలో రెండు గ్రామాలకు సమానంగా న్యాయం జరగాలని కోరారు. అంతేకాకుండా కిచ్చన్నపేట గ్రామస్తుల మేము 70 సంవత్సరాల నుండి గడ్డివాములు పెంటలు వేసుకొని కబ్జాలో ఉన్నాము.అక్కంపల్లి గ్రామపంచాయతీ వాళ్లు మాస్థలంలో జిపి భవనం నిర్మిస్తామని తెలుపగా అక్కంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మెయిన్ రోడ్డు వెంబడి స్థలాలు ఉన్నప్పటికీ రాజకీయ కక్ష కోసం మాస్థలంలో జిపి భవనం కట్టాలని ప్రయత్నం చేస్తున్నారని,కావున మాస్థలంలో గ్రామపంచాయతీ భవనం కట్టకూడదని అట్టి స్థలాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమని కోరుతూ కిచ్చన్నపేట గ్రామస్తులు డిపిఓ,పిఆర్డి ఈఈకు శనివారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో తాండూర్ కిచ్చన్నపేట గ్రామస్తులు ఉన్నారు.