31-01-2026 09:55:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, శనివారం సాయంత్రం, కలెక్టరేట్ లోని వీసీ హాలు నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ఆదేశించారు.
2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరి పోల్చి మ్యాపింగ్ ప్రక్రియను తర్వాతగతిన పూర్తి చేయాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ లు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. బిఎల్ఓ లు రోజువారీగా చేపట్టి ప్రోజెని మ్యాపింగ్ వివరాలను తమకు అందిస్తూ ఉండాలని పేర్కొన్నారు. బిఎల్ఓ లకు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎబిఎల్ఓ లు సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎక్కడైనా పోలింగ్ బూత్ లలో ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బూత్ లకు చెందిన బిఎల్ఓలు అందరూ సమన్వయం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. నిర్ణిత గడువులోగా ఈ ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.