calender_icon.png 1 February, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

31-01-2026 09:12:59 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల ఏర్పాటు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచవచ్చని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మేనేజర్ ఎం. అశోక్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.