calender_icon.png 31 January, 2026 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ కు ఘన నివాళులర్పించిన ఆర్మూర్ దళిత, ప్రజా సంఘాల నాయకులు

31-01-2026 09:33:54 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): తన కలం, గళంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన ప్రజాగొంతుక, తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజయుద్ధనౌక గద్దర్ 78వ జయంతి కార్యక్రమాన్ని శనివారం ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ డివిజన్ దళిత, ప్రజా,యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్న మాజీ జడ్పీ చైర్మన్ గంట సదానందం,

ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ పోరాటంలో తెలంగాణ తెగువగా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని తన గలంతో ప్రశ్నించిన తీరును, సమాజంలో వెళ్లనుకుని ఉన్న వివక్ష, అసమనతలపై అలుపెరగని పొరుచేసిన గద్దర్ వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాదిగసంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, అంసా అధ్యక్షులు అంగరి ప్రదీప్, సీపీఎం నాయకులు ఎల్లన్న, మూగ  ప్రభాకర్, షెట్పల్లి నారాయణ, జంగం అశోక్, పింజ పెద్ద భోజన్న, మేకల కోటేశ్వరరావు, ఆర్గుల్ సురేష్, పులి సాయిరాం, పులి గంగాధర్, వనం శేఖర్, నటరాజ్, సాయిరాం, అంబులెన్స్ రాజు తదితరులు పాల్గొన్నారు.