calender_icon.png 31 January, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాల పరిరక్షణ అందరి బాధ్యత

31-01-2026 09:37:43 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిస్థాయి పట్టణ పరిధిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలతో పాటు అధికారులపై కూడా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం న్యూ శాయంపేట 31 డివిజన్లో హనుమకొండ జిల్లాలోని మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం ఆధ్వర్యంలో కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ బాలలసదనం (బాలికల) నూతన భవనానికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 100 మంది రక్షణ సంరక్షణ అవసరమున్న బాలికలకు ఆశ్రమం కల్పించేలా ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. పకృతికి అనుగుణంగా అభివృద్ధి సాగితేనే అన్ని రంగాల్లో స్థిరమైన పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. చెట్లు ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటే పట్టణాలు అభివృద్ధికి నిలయాలుగా మారుతాయని ఒకప్పుడు గ్రామంగా ఉన్న శాయంపేట డివిజన్ పట్టణ వాతావరణకు అనుగుణంగా అభివృద్ధి చెందిందుకు అవసరమైన నిధులు కేటాయించామని తెలిపారు.

నిర్విత గడువులోపు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తప్పుచేసే వారు ఎవరైనా వారిని ఉపేక్షించే వద్దని, అన్యాయాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి టి డబ్ల్యూ ఓ జడ్పీ జయంతిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. విధి నిర్వహణలో చివరి రోజు కూడా అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో 31 డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు మోహన్ రావు, శివశంకర్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, ఆర్జేడి ఝాన్సీరాణి, జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి, హనుమకొండ సిడిపిఓ విశ్వజ, కాజీపేట కాజీపేట తహసిల్దార్ రాజకుమార్, సుబేదారి సిఐ రంజిత్ కుమార్, టిజిడబ్ల్యుఐడి సిడి రవీందర్, సూపర్డెంట్ పులిచేరు కళ్యాణి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.