calender_icon.png 31 January, 2026 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ప్రజావాణి రద్దు

31-01-2026 09:46:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం నిలిపివేస్తామని, కోడ్ ముగిసిన వెంటనే యథావిధిగా తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.