calender_icon.png 10 December, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

09-12-2025 07:48:35 PM

నంగునూరు: నంగునూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహబూబ్ అలీ మాట్లాడుతూ.. అధికారులు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు మధుసూదన్ రెడ్డి, బాలరాజ్, రాంభూపాల్ రెడ్డిలు ఓటింగ్ విధానం, కౌంటింగ్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.