19 April, 2026 | 6:33 PM

కూల్చివేతలను అడ్డుకున్న కార్పొరేటర్

07-06-2025 12:00 AM

ముషీరాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి): గాంధీనగర్ డివిజన్, చిక్క డపల్లిలోని బాపునగర్ వద్ద మున్సి పల్ మార్కెట్,  కృష్ణ పత్రిక భవనా లను జిహెచ్‌ఎంసి అధికారులు శుక్ర వారం ఉదయం కూల్చివేతలు చేప ట్టారు. విషయం తెలుసుకున్న గాంధీ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావ ని వినయ్ కుమార్ వెంటనే అక్కడికి చేరుకొని కూల్చివేతలను అడ్డుకున్నా రు.

మార్కెట్ కమిటీ అసోసియేషన్ సభ్యులు, బాపు నగర్ బస్తి వాసులు ఘటన స్థలానికి చేరుకున్న కార్పొరే టర్  కూల్చివేతలపై వివరాలను తెలి పారు. వారి విజ్ఞప్తి మేరకు వారం రో జుల గడువులో కమిటీ సభ్యులు, బస్తి వాసులు  అధికారులతో చర్చ లు జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ అన్నారు. అంతవరకు కూల్చివేతలు ఆపాలని సూచించారు.