04-11-2025 01:47:59 AM
							ఆర్డీఓ కార్యాలయం ముట్టడించిన విద్యార్థులు
జహీరాబాద్, నవంబరు 3 :స్కాలర్షిప్లు విడుదల చేస్తావా లేక గద్దె దిగుతావా అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. బీద, బడుగు, బలహీన వ ర్గాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదని నిరసిస్తూ సోమవారం పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జహీ రాబాద్ ఆర్డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
కార్యాలయం ముందు బైఠాయించిన విద్యార్థు లు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఏకమై తెలంగాణ సాధించుకున్నామని, ముఖ్యమంత్రిని గద్దెదించడం లెక్క కాదంటూ విమర్శించారు. ప్రభుత్వం రూ.8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయశారు. అనంతరం డీఏవోకు మెమోరాండం సమర్పించారు. ఈ కార్య క్రమంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.