calender_icon.png 8 October, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిసి మార్కెట్లను తెరవాలని పత్తి రైతుల డిమాండ్

08-10-2025 08:24:12 PM

చిట్యాల (విజయక్రాంతి): పత్తి రైతుల కష్టాలను తెలుసుకొని తక్షణమే సిసి మార్కెట్లను తెరవాలని చిట్యాల మండల పత్తి రైతులు బుధవారం అధికారులను డిమాండ్ చేశారు. పత్తి పంటపై చీడపురుగుల ప్రభావం తీవ్రంగా ఉండడం వలన పంట పూర్తిగా దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎరువులకు, క్రిమిసంహారకాలకు, పంట సాగుకు అధిక మొత్తంలో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయామన్నారు. మరోవైపు అకాల వర్షాల వలన పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, చేనులోని పత్తి తడిసి పూర్తిగా రైతులకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో రైతులు పత్తి పంటను సాగు చేయడం వలన కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే రైతులకు పత్తి అమ్ముకోవడానికి తక్షణమే సిసి మార్కెట్ తెరవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని రైతుల పక్షాన కన్నెబోయిన మహాలింగం తెలిపారు.