calender_icon.png 8 October, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్కు సందర్శన

08-10-2025 08:20:57 PM

ప్రాసెసింగ్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు..

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సమీకృత వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్కును ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త, పీర్జాదిగూడ కమిషనర్ టీ ఎస్ వి ఎన్ త్రీలేశ్వరావుతో కలిసి సందర్శించారు. ఘణ వ్యర్ధాల ప్రాసెసింగ్ ప్లాంట్ లో యంత్రాల పనితీరు వాటి సామర్థ్యం, ఘన వ్యర్ధాలను వేరుచేయు విధానం కాంపోస్ట్ యూనిట్ తడి వ్యర్ధాలతో బ్రీకెట్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న ప్రాసెసింగ్ విధానంపై పలువురు అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పీర్జాదిగూడ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయినాథ్ గౌడ్, ఏఈ వినీల్, ఐటీసీ ప్రతినిధులు ఉమాకాంత్, సుధా, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ బాల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.