08-10-2025 08:26:48 PM
న్యాయవాది ఐలాపూర్ మాణిక్ యాదవ్..
అమీన్ పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని న్యాయవాది ఐలాపురం మాణిక్ యాదవ్ కోరారు. తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై విచారణ కొనసాగుతుండగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాల న్యాయం, చట్టపరమైన అంశాలపై స్పందించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం అంటే సామాజిక న్యాయం చేయడమేనని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 42 శాతం రిజర్వేషన్ అమలు అవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి బీసీ రిజర్వేషన్ కేసుల్లో కూడా ప్రభుత్వం తరఫున న్యాయపరమైన బలమైన వాదనలు వినిపించబడినట్లు తెలిపారు. అప్పట్లోనూ కోర్టులు 50 శాతం పరిమితి శాశ్వత నియమం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాలు దాన్ని మించవచ్చని పేర్కొన్నారు. హైకోర్టు విచారణను తాము గౌరవిస్తున్నామని, కానీ బీసీల హక్కు తప్పక రక్షించబడాలని స్పష్టం చేశారు.