22-10-2025 12:00:00 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
రేగోడు, అక్టోబర్ 21: పత్తి అమ్ముకునే రైతులు స్లాట్ బుక్ చేసుకొని పత్తి మిల్లులో పత్తిని అమ్ముకోవచ్చని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం రేగోడులోని రైతు వేదికను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి జాతీయ ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పత్తి రైతు వేసిన పంటను పత్తి పంటను అమ్ముకునేటప్పుడు స్లాట్ బుక్ చేసుకొని సీసీఐలో పత్తిని అమ్ముకొని ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు,
అదేవిధంగా రైతులకు శనగ విత్తనాలను, సన్ ఫ్లవర్ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం రేగోడులోని పశు వైద్యశాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏడిఏ రాంప్రసాద్, ఏడిఏ టెక్నికల్ వినయ్ విన్సెంట్, ఏవో జావిద్, తహసిల్దార్ దత్తరెడ్డి, పిసిసి సభ్యులు మున్నూరు కిషన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.