22-10-2025 12:00:00 AM
పత్తి మిల్లులు, దళారుల కాంటలపై తనిఖీలు జరపాలి
మంజీర రైతు సమాఖ్య రాష్ట్ర కోశాధికారి జైపాల్
కొండాపూర్, అక్టోబర్ 21 : పత్తి పంట అమ్మకాలపై రైతు సంఘాలతో సిసిఐ సమావేశాలు ఏర్పాటు చేయాలని, పత్తి పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోతున్నారని మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర కోశాధికారి జైపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం కొండాపూర్ మండల పరిధిలోని అనంతసాగర్ సెంటర్ లో పత్తి రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్తి కొనుగోలు చేసే జిన్నింగ్ మిల్లుల్లో తూకంలో మోసాలు చేస్తూ తేమ శాతం పేరుతో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో దళారులు రాకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లు సులువుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిసాన్ కాపాస్ యాప్ లో సాంకేతిక ఇబ్బందులు రాకుండా కొనుగోలు సజావుగా సాగేలా చూడాలన్నారు. సీసీఐ కొనుగోళ్లలోను కొందరు దళారులు అధికారులతో కుమ్మక్కై పత్తిని కొనుగోలు తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతులు వహీద్, వెంకట్ రెడ్డి, బుచ్చయ్య, ఇసుబు, శ్రీశైలం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.