calender_icon.png 8 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాడలేని ప్రత్యేక అధికారులు

08-11-2025 12:41:43 AM

-గ్రామాలలో పడకేసిన పాలన అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

-అధికారుల తీరుతో ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత

బెజ్జంకి, నవంబర్ 7:తెలంగాణలో సర్పంచ్ ల పదవికాలం 2024 జనవరిలో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. గ్రామాల్లో ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకుని దాదాపు రెండు సంవత్సరాలు వ్యవధి దగ్గర కావస్తున్నా ఇప్పటి వరకు కొన్ని గ్రామల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కనిపించటం లేదు. సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న పట్టించుకునే నాథుడే లేకుండ పోయారు.

వచ్చామా.. హాజర్ వేసుకున్నామా కార్యాలయంలో కూర్చున్నామా విధుల టైం ముగిసిందా... వెళ్ళామా.. ఈ తంతు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కొనసాగుతుంది. అధికారులు కార్యాలయానికి పరిమితం అవడం శోచనీయం, ఆయా గ్రామాలకు నియమించిన ప్రత్యేక అధికారులు 2024 ఫిబ్రవరిలో గ్రామ పం చాయతీ కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టినప్పటికి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలే దని ఆయా గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు విధుల్లో వివరించే తీరువల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గ్రామాల్లో తాగునీటి, మురుగు కాలువలు, ఇతర అన్ని సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినప్పటికి బెజ్జంకి మండల ఆధికారులు ఇప్పటివరకు ప్రజా సమస్యలపైన ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండల ప్రజలు అంటున్నారు.

ఇప్పటివరకు మండల కేంద్రంలో ని డబల్ బెడ్ రూమ్ కాలనిలో నీటి తీవ్రత పెరిగిపోయింది, మండల పరిధిలోని గ్రామాల్లో మాత్రం తాగునీటి కలుషిత సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామాల్లో ప్రజాలు అంటున్నారు. ఇక పారిష్యుద్ధ పనులను చేయించడానికి నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆయా గ్రామాలకు బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి తాగునీటి సమస్య, అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు, రోడ్లు ఇతర ప్రజా సమస్యలు పరిష్కరిం చాలని మండల ప్రజలు కోరుతున్నారు.