calender_icon.png 14 May, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గురుకులలో 16వ తేదీన కౌన్సిలింగ్: ప్రిన్సిపల్ ఇంద్రజ

14-05-2025 10:29:17 AM

నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలం(Nagalgidda Mandal) కరస్ గుత్తి గిరిజన గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఇంద్రజ మాట్లాడుతూ సంగారెడ్డి రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నందు సంగారెడ్డి  జిల్లా లో 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, మనుర్ కరస్ గుత్తి నందు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సిఇసి ,హెచ్ఇసి గ్రూపులలో ప్రవేశము కొరకు 2024-25 విద్యా సంవత్సరము పదవ తరగతి లో ఉత్తీర్ణత పొందిన అమ్మాయిలకు తేదీ.16.05.2025 ఉదయం 11.00 గంటలకు పివిటిజి కళాశాల(బాలురు) హయత్ నగర్ లో కౌన్సిలింగ్ నిర్వహించబడును. అట్టి కౌన్సిలింగ్ కు హాజరవుతున్న  విద్యార్థులు 1.బదిలీ ధృవీకరణ పత్రము.2. పదవ తరగతిలో సాధించిన మార్కుల మేమో (2024-25), 3. స్టడీ మరియు

 కండక్ట్ సర్టిఫికేట్. 4. కుల ధృవీకరణ పత్రము, 5. ఆదాయ ధృవీకరణ పత్రము (2024-25, గ్రామీణ ప్రాంతమునకు సంభందించిన వారు రూ.1,50,000/-మరియు పట్టణ ప్రాంతమునకు సంభందించిన వారు రూ.2,00,000/- కు మించరాదు). 6. ఆధార్ జిరాక్స్ మరియు స్పోర్ట్స్, అర్ఫాన్, PHC ధృవీకరణ పత్రములు, 3 కలర్ ఫోటోలు, రెండు జతల నకలు కాపీలుతో హాజరు కాగలరని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ పాఠశాల/కళాశాల కరస్ గుత్తి ప్రిన్సిపల్ ఇంద్రజ తెలిపారు.     కాబట్టిఎంపీసి, బైపిసి,  గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్ల యందు ప్రవేశం పొందగోరే అమ్మాయిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదనపు సమాచారం కొరకు ఫోన్ నెంబర్ 88856 09167 సంప్రదించాలని కోరారు