calender_icon.png 14 May, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోయిన్ పల్లిలో అగ్నిప్రమాదం

14-05-2025 11:11:18 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి(Secunderabad Bowenpally)లోని డెంటింగ్ గ్యారేజీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ బస్సుకు డెంటింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూల్ బస్సు నుంచి ఇతర వాహనాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజీ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.