14-05-2025 10:56:10 AM
వేములవాడ బంద్
కరీంనగర్,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పేరుతో జూన్ 15 నుండి రాజన్న ఆలయాన్ని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం వేములవాడ పట్టణ బంద్(Vemulawada bandh) రాజన్న ఆలయ రక్షక కమిటీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీసహా అన్ని పార్టీల నాయకులతో కలిసి ‘రాజన్న ఆలయ రక్షక కమిటీ’ ఆధ్వర్యంలో బంద్ లో పాల్గొంటున్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాబోయే రెండు సంవత్సరాలపాటు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించడంతో రాజన్న ఆలయ రక్షక కమిటీ ఉద్యమాన్ని ప్రారంభించింది. కమిటీ ఛైర్మన్ ప్రతాప రామక్రిష్ణ మాట్లాడుతూ.. అభివ్రుద్ధి పేరుతో 2 ఏళ్లపాటు రాజన్న ఆలయాన్ని మూసివేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. వేములవాడ రాజన్న అభివృద్ధి పేరుతో పరివార్ దేవతామూర్తుల విగ్రహాలను తొలగించడాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.. వ్యాపారులంతా స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారని సాయంత్రం వరకు బంద్ కొనసాగుతుందని అన్నారు. ఇది ఇలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.