calender_icon.png 14 May, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్‌లో కూల్చివేతలపై కేటీఆర్ ఆగ్రహం

14-05-2025 11:34:19 AM

హైదరాబాద్: అందాల పోటీల్లో పాల్గొంటున్న వారి వరంగల్‌(Warangal) పర్యటన కోసం పేదల ఇళ్లు కూల్చుతున్న రేవంత్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక కాంగ్రెస్ విధానంపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బుల్డోజర్ కంపెనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రహస్య ఒప్పందం చేసుకుందా?, ప్రతిరోజూ పేదల ఇళ్లతో పాటు, దుకాణాలను ఎందుకు కూల్చుతున్నారు?, పేదల జీవితాలను బుల్‌డోజర్లు కింద ఎందుకు నలిపేస్తున్నారు?,  అందాల పోటీల కోసం పేదవారి ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా?, రూ. 200 కోట్ల ప్రజా సొమ్ము ఖర్చుపెట్టి రాజ భవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్(Warangal demolitions) అయ్యారు. వరంగల్‌లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను అధికారులు తొలగించారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగించారు. రోడ్డు పక్కన షాపులు వాళ్లు దండం పెట్టినా.. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదని బాధితులు కంటతడి పెట్టుకుంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం వ్యక్తం చేశారు.