14-05-2025 12:11:29 PM
అమృత్‌సర్: ఏప్రిల్ 23న పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా అరెస్టు చేయబడిన బీఎస్‌ఎఫ్ జవాన్(BSF jawan) పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ బుధవారం భారతదేశానికి అప్పగించిందని ఫోర్స్ తెలిపింది. బీఎస్‌ఎఫ్ జవాన్ ను పాకిస్తాన్ రేంజర్స్(Pakistan Rangers) బుధవారం ఉదయం 10:30 గంటలకు సరిహద్దు భద్రతా దళం (Border Security Force)కి అప్పగించారు. అప్పగింత శాంతియుతంగా, ప్రోటోకాల్‌ల ప్రకారం జరిగిందని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ఒక రోజు తర్వాత, ఏప్రిల్ 23న ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండియా-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పూర్ణం కుమార్ షాను రేంజర్లు అరెస్టు చేశారు. 20 రోజుల తర్వాత పాక్ నుంచి జవాన్ పూర్ణమ్ కుమార్ షా(Purnam Kumar Shaw) విడుదలయ్యాడు. పాకిస్థాన్ అట్టారి సరిహద్దు దగ్గర జవాన్‌ను భారత్‌కు అప్పగించించింది.
బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా తండ్రి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి భోలా నాథ్ షా మాట్లాడుతూ, “నిన్న రాత్రి, కొంతమంది సీనియర్ అధికారులు ఈ పరిణామం గురించి మాకు ఫోన్ చేసి తెలియజేశారు. అతను విడుదల కానున్నాడని వారు మాకు చెప్పారు. మాకు ఇంకా అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.” అని తెలిపారు. ఏప్రిల్ 23 మధ్యాహ్నం పంజాబ్‌లోని ఇండో-పాకిస్తాన్ సరిహద్దులో విధుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన షాను పాకిస్తాన్ రేంజర్స్ పట్టుకున్నారు. ప్రారంభ రోజుల్లో, పాకిస్తాన్ రేంజర్స్ సిబ్బంది సరిహద్దు వద్ద జరిగిన ఫ్లాగ్ మీటింగ్‌లకు బీఎస్ఎఫ్ అధికారులతో హాజరయ్యారు.
కానీ దళాలు సరిహద్దు వెంబడి వేర్వేరు ప్రదేశాలలో క్రాస్ ఫైరింగ్‌లో నిమగ్నమై ఉండటంతో, అన్ని స్థాయిలలో వారి మధ్య కమ్యూనికేషన్ ఆగిపోయింది. ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఇండో-పంజాబ్ సరిహద్దులో విధుల్లో చేరిన షా, బుధవారం జీరో లైన్ సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న సరిహద్దు గ్రామస్తులకు (రైతులు) సహాయం చేస్తుండగా అనుకోకుండా సరిహద్దు దాటాడు. దీంతో పాకిస్తాన్ సరిహద్దు కాపలా దళం అతన్ని పట్టుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నివాసి అయిన షా, ఏప్రిల్ 10 నుండి ఇండో-పంజాబ్ సరిహద్దులో తాత్కాలిక బృందంతో పోస్ట్ చేయబడ్డాడు. అతను తన యూనిఫాం ధరించి విధుల్లో ఉన్నప్పుడు అనుకోకుండా సరిహద్దు దాటినట్లు అధికారులు వెల్లడించారు.