calender_icon.png 23 August, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

23-08-2025 02:55:36 PM

ఎమ్మెల్యేలు పార్టీలు మారటం కొత్తేం కాదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy ) తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. కాళేశ్వరంపై గతంలో కాంగ్రెస్ లేఖ రాసింది.. ఇప్పుడు మౌనంగా ఉందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మెట్రో నష్టాల్లో కొనాసాగుతోందని చెప్పారు. ఫేస్ 1 లో పూర్తి కావాల్సిన అఫ్జల్ గంజ్ నుంచి ఫలక్ నుమా పనులు పూర్తికాలేదని వెల్లడించారు. ట్రై పార్టీ ఒప్పందం ఉన్న మెట్రో రెండో ఫేస్(Second phase of Metro) కు కేంద్ర నుంచి అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి మారటం కొత్తేం కాదన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు నైతికత లేదని విమర్శించారు. బ్లాక్ లో యూరియా అమ్ముతున్నారని కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ లో అమ్మే యూరియా ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించారు. చెప్పిన ప్రకారం 50 వేల టన్నుల యూరియా ఇస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం ఉండొద్దు.. ప్రత్యర్థులే ఉండాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్ధాంతపరంగా మాత్రమే మాట్లాడాలి.. ఇష్టారీతిన మాట్లాడొద్దని సూచించారు.