23-08-2025 02:59:56 PM
కృత్రిమ కొరతకు తెరలేపిన బిజెపి బిఆర్ఎస్ నాయకులు..
అవగాహన లేక మాట్లాడుతున్న మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్..
పెద్దపల్లిలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు..
పెద్దపల్లి (విజయక్రాంతి): రైతులు అధైర్యపడవద్దని, జిల్లాలో యూరియా కొరత లేదని శనివారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు(MLA Chinthakunta Vijaya Ramana Rao) అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షాకాలం పంటలకు సరిపడా యూరియాను జిల్లాలో పకడ్బందీగా సరఫరా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సాగు జరుగుతున్న పంటను అంచనా వేసి సింగిల్ విండో ఫర్టిలైజర్ల ద్వారా రైతులకు యూరియాను అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్ డిఏ లో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి యూరియాను అందించడంలో వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు.
జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల 76, వేలపై చిలుకు పంటలు సాగుబడి అవుతోందని 28 లక్షల ఒక వంద 95 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మారం అన్ని మండలాలలో రెండు లక్షల 50 వేల ఎకరాలు సాగు జరుగుతుందని, మరో 15 వేల ఎకరాలు రైతులు వరి నాట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ ద్వారా చెరువులు కుంటలు సమృద్ధిగా ఉండడంతో సాగు బడికి రైతులు ముందుకు వచ్చారని, వ్యవసాయ అధికారులు అంచనా వేశారని పేర్కొన్నారు. నెలవారీగా యూరియాను అందిస్తున్నామని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో 21 వేల 581 మెట్రిక్ టన్నుల యూరియా మార్కెట్లో ఉందని పేర్కొన్నారు. కొత్తగా వేసే సాగు బడికి 65 టన్నుల యూరియా అవసరము పడుతుందని తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు.
పెద్దపల్లి నుండి ఇతర ప్రాంతాలకు యూరియా తరలిపోకుండా నాలుగు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 65 నుండి 70 శాతం యూరియా ను రైతులు వినియోగించుకున్నారని తెలిపారు. రామగుండంలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ 78 రోజులుగా మూతపడి ఉందని దానిని సరిచేసి తెరిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. తెలంగాణకు నష్టం జరుగుతోందని ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించిన స్పందించడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ లు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ను కలిసి యూరియా అందించాలని, అడిగిన కేంద్రం స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఏమి మాట్లాడుతున్నారో అర్థం అయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తెలంగాణకు యూరియా కావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనకు ప్రియాంక గాంధీ మద్దతు పలికి తెలంగాణకు యూరియాను అందించాలని కోరారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడే మాటల్లో స్పష్టత లేదని యూరియా ఇచ్చిన వారికి మద్ద ఇస్తామని తెలపడం సిగ్గుచేటని యూరియా కృత్రిమ కొడతాను సృష్టించేది బిఆర్ఎస్ నాయకులు అని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ చెంప చెల్లుమనిపించే విధంగా సమాధానం ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డి దామోదర్ రావు,అబ్బయ్య గౌడ్,చిలుక సతీష్, సాయిరి మహేందర్, గాజుల రాజమల్లు, ఉస్తేం గణేష్, అమీర్ శెట్టి రాజలింగం, పన్నాల రాములు, అమీరి శెట్టి తిరుపతి, ముత్యాల రవీందర్, పళ్ళ సురేష్, కల్లెపెల్లి జానీ, గాదాసు రవి, బండ గోపాల్, దున్నపోతుల రాజయ్య, మమ్మద్ రఫీక్, చింతల రాజు, మధు, దొరికొండ ప్రభాకర్, బండారి రమేష్, అమీనోద్దీన్, ఆరేపల్లి కిరణ్, సముద్రాల విష్ణు, మేడి శ్రీనివాస్ గౌడ్,లతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.