23-08-2025 02:49:49 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని ఎంవీఐ కార్యాలయం(MVI office)లో శనివారం విజిలెన్స్ అధికారుల దాడులు చేశారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన అధికారులు హుటాహుటిన కార్యాలయంలోని అధికారులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ కార్యాలయంలో గతంలో ఏసీపీ అధికారులు దాడులు చేయగా, ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని విచారించారు. ఆ విచారణలో వారు అక్రమంగా డబ్బులు తీసుకొని అధికారులకు ఇస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఎంబీఐ కార్యాలయంలో దాడులు చేయడంతో మళ్లీ ఏజెంట్లు, అధికారులు బయటపడతారా... చూడల్సి ఉంది