నకిలీ మందుల తయారీపై ఉక్కుపాదం మోపాలి
11-06-2024 02:12 AM
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహా
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): నకిలీ మందులు తయారు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ను మరింతగా బలోపేతం చేయా లని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన చాంబ ర్‌లో సోమవారం ఆయన 17 మంది నూతన డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు నియాకమ పత్రాలు అందించి పలు అంశాలపై సూచనలిచ్చారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందేలా చూడాలన్నారు. మెడికల్ షాపుల్లో మెడిసిన్ విక్రయంపై నిత్య పర్యవేక్షణ ఉండాల న్నారు. కాలం చెల్లిన, నకిలీ మెడిసిన్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.






