వచ్చే మూడు రోజులు వానలే!
హైదరాబాద్, జూన్ 10 ( విజయక్రాంతి): తెలంగాణలోని పలు ప్రాం తాలకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. సోమవారం ఉత్తర అరేబి యా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించను న్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజయనగరం, ఇస్లాంపూర్ వరకు వ్యాపించనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో రానున్న మూడు రోజులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవ కాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతా వారణ శాఖ పేర్కొంది.
మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారా యణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బుధవారం రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.






