24 July, 2026 | 3:21 AM

బోధన్ పట్టణంలో నకిలీ నోట్లు!

24-07-2026 12:00 AM

కిరాణా షాపులు, మద్యం దుకాణాల్లో మార్పిడి 

బోధన్, జూలై 23 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలో నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. కిరాణా షాపులు, మద్యం దుకాణాల్లో వీటి మార్పిడి జోరుగా జరుగుతున్నది. రూ.100, రూ.200 నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలుస్తున్నది. గురువారం  మద్యం కొనుగోలుకు వచ్చిన వ్యక్తులు నకి లీ నోట్ల ద్వారా మద్యం కొన్నారు. అసలు నోట్లను పోలి ఉండటంతో వీటిని గుర్తించడం ఇబ్బంది గా మారింది. ఖాళీ సమయం లో కౌంటర్‌లో ఉన్న నగదు లెక్కించుకునే సమయంలో గుర్తించారు.